Tirupati: తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటన.. రేణిగుంటలో ఘనంగా స్వాగతం!

Tirupati: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 12 Jun 2026 12:22 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటన.. రేణిగుంటలో ఘనంగా స్వాగతం!

Tirupati: తిరుపతి జిల్లా ఒక్క రోజు పర్యటన నిమిత్తం నేటి శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గౌరవ ఆం.ప్ర. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం లభించింది.

జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, చిత్తూరు ఏం పి దగ్గుమల్ల ప్రసాదరావు. తిరుపతి, కాళహస్తి, కోడూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు బొజ్జల సుధీర్ రెడ్డి అరవ శ్రీధర్, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ హరి ప్రసాద్, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి, కోటం ప్రభుత్వ ప్రజాప్రతినిధులు తదితరులుస్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

అనంతరం ఉప ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన దామినేడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story