Nagari: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి.. ఏఐటీయూసీ డిమాండ్

Nagari: మున్సిపల్ రంగ ప్రైవేటీకరణకు సంబంధించిన జీఓ 975, 673లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పుత్తూరులో నగిరి ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 22 Jun 2026 5:31 PM IST
Nagari
X

Nagari: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి.. ఏఐటీయూసీ డిమాండ్

Nagari: మున్సిపల్ రంగంలోని 14 కీలక విభాగాల ప్రైవేటీకరణకు సంబంధించిన జీఓ నెం.975, 673లను తక్షణమే రద్దు చేయాలని, హైకోర్టు తీర్పు మేరకు మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌కు యూనియన్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు డి. మహేష్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ అమలు చేయాలని, 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కారుణ్య నియామకాలు కల్పించాలని కోరారు.

తిరుపతి కార్పొరేషన్, పుత్తూరు మున్సిపాలిటీలలో పెరుగుతున్న పనిభారానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హామీ ఇచ్చారు.కార్యక్రమంలో యూనియన్ నాయకులు విజయ్‌కుమార్, కుమార్, రామయ్య, ప్రభాకర్, దేవరాజులు తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story