Renigunta: ఆద్య - సర్వేశ్' వైన్ షాపులను ఊరి బయటకు తరలించాలి!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట పాంచాలినగర్‌లో 'ఆద్య-సర్వేశ్' వైన్ షాపులను తొలగించాలని ఐద్వా ఆధ్వర్యంలో 3వ రోజు వీధి నిరసన చేపట్టారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 10 Aug 2026 10:10 PM IST
Renigunta
X

Renigunta: ఆద్య - సర్వేశ్' వైన్ షాపులను ఊరి బయటకు తరలించాలి!

రేణిగుంట: రేణిగుంట పట్టణంలో మద్యం షాపులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో రేణిగుంట పంచాయతీ పాంచాలినగర్ నందు 3వ రోజు "వీధి నిరసన" చేపట్టారు.

ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి మాట్లాడుతూ.. రేణిగుంటలో శ్రీ గంగమ్మ జాతరను .. మందుబాబుల జాతరగా మారకముందే.. "మద్యం షాపులు బంద్" కు మూసివేతకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని కోరారు.ఫ్యాక్టరీలో పనిచేసే మహిళ కార్మికులకు, స్థానిక మహిళలు,చిన్నపిల్లలపై అవాంఛనీయ ఘటనలు జరగకుండా మందుబాబుల నుండి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ,మండల అధ్యక్షురాలు భారతి,మద్యం వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి పద్మావతి,స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story