Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో!

Srikalahasti: శ్రీకాళహస్తి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 20 Jun 2026 10:18 AM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో!

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని ఊరందరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి చేపల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్‌తో పాటు క్లీనర్ గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంతో బొలెరో వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. వాహనంలో ఉన్న చేపల లోడు రోడ్డుపై చిందరవందరగా పడిపోయింది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story