Sullurupeta: సూళ్ళూరుపేటలో బ్రహ్మంగారి 333వ ఆరాధన మహోత్సవాలు!

Sullurupeta: సూళ్ళూరుపేటలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 333వ ఆరాధన మహోత్సవాలు.

V. Narasimhulu, Nellore
Published on: 25 April 2026 10:42 AM IST
Sullurupeta
X

Sullurupeta: సూళ్ళూరుపేటలో బ్రహ్మంగారి 333వ ఆరాధన మహోత్సవాలు!

Sullurupeta: సూళ్ళూరుపేట పట్టణంలోని జిఎన్టీ రోడ్డులో కొలువై ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నందు, 333వ ఆరాధన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. ఈ నెల ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం ప్రారంభమై, 28వ తేదీ మంగళవారం వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను శుక్రవారం సాయంత్రం ఆలయ కమిటీ అధ్యక్షుడు చిట్టేటి పెరుమాళ్ళు మరియు సభ్యులు ఆలయ ప్రాంగణంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు చిట్టేటి పెరుమాళ్ళు మాట్లాడుతూ..

గతంలో తమ తండ్రి గారైన చిట్టేటి పండయ్య ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయని, ఆయన మార్గనిర్దేశంలో గత 13 సంవత్సరాలుగా కమిటీ సభ్యులు, భక్తులు మరియు దాతల సహకారంతో ఈ సంప్రదాయాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల ప్రణాళికను వివరిస్తూ, మొదటి రోజు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తామని, రెండవ రోజు సోమవారం అభిషేకంతో పాటు వీరబ్రహ్మేంద్ర స్వామి - అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కనులపండువగా జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించే గ్రామోత్సవానికి సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఉభయ దాతలుగా వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. మూడవ రోజు హోమాలు, ప్రత్యేక పూజలతో వేడుకలు ముగుస్తాయని, మూడు రోజుల పాటు భక్తులందరికీ మధ్యాహ్నం వేళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరింది.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story