Srikalahasti: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి 29 మోటార్ స్టార్టర్లు మాయం!
Srikalahasti: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామంలో ఒకే రాత్రి 29 వ్యవసాయ మోటార్ స్టార్టర్లు చోరీకి గురయ్యాయి.
Srikalahasti: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి 29 మోటార్ స్టార్టర్లు మాయం!
శ్రీకాళహస్తి: నియోజకవర్గం లోని ఏర్పేడు మండలం మడిబాక గ్రామం చుట్టుప్రక్కల ఉన్న రైతుల పొలాల్లో అమర్చిన విద్యుత్ మోటార్ స్టార్టర్లను గుర్తు తెలియని దుండగులు చోరీ చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే రాత్రి 29 స్టార్టర్లు వరకు చోరీకి గురైనట్లు బాధిత రైతులు తెలిపారు.రైతులు తెలిపిన వివరాల ప్రకారం,ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు స్టార్టర్ బాక్సులు ఖాళీగా ఉండడం,విడిభాగాలు పొలంలో చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి కన్నీరు పెట్టుకున్నారు.
పంటలకు నీరందించే సమయంలో ఈ చోరీ జరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఒక స్టార్టర్ విలువ రూ.5600 వరకు ఉంటుందని,దీంతో ఒక్కొక్కరికి వేల రూపాయల నష్టం వాటిల్లిందని వాపోయారు.
"ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరిగి అప్పుల్లో కూరుకుపోయాం.పంట చేతికొచ్చే సమయంలో స్టార్టర్లు ఎత్తుకెళ్లారు.కొత్తవి కొనే స్థోమత లేదు.పొలం ఎండిపోతే ఏం చేయాలి" అని బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.ఇది వరలో చెల్లూరు,ఎండి పుత్తూరు లో 15 స్టార్టర్లు దొంగలించబడడం ఈ ఘటన జరిగి 10 రోజులకే ఇలా జరగడం చూసి రైతులు కన్నీటి పర్యంతమైయ్యారు.
ఈ ఘటనపై బాధిత రైతులుచరవాణి ద్వారా స్థానికఏర్పేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఒకే రోజు రాత్రి మడిబాక గ్రామంలో 29 స్టార్టర్లు చోరీ కావడంతో ఇది వ్యవస్థీకృత ముఠా పనే అయి ఉంటుందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వ్యవసాయ మోటార్లకు అమర్చే స్టార్టర్ల చోరీలు ఇటీవల పెరిగిపోయాయని, రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని, నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని రైతులు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




