Renigunta: 2019 రేణిగుంట రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా!

Renigunta: 2019లో రేణిగుంట–శ్రీకాళహస్తి రహదారిపై ఏడుగురి మృతికి కారణమైన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు దామోదరానికి తిరుపతి కోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ.3,000 జరిమానా విధించింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 28 Aug 2026 8:50 PM IST
Renigunta
X

Renigunta: 2019 రేణిగుంట రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా!

రేణిగుంట: 2019లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడికి ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష, రూ.3,000 జరిమానా విధిస్తూ తిరుపతి ప్రథమ అదనపు న్యాయ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది.

2019 జూన్ 7న శ్రీకాళహస్తి–రేణిగుంట రహదారిపై నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.ఈ ఘటనపై రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం.175/2019గా కేసు నమోదైంది.

పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడు టి.దామోదరం (51) నేరస్థుడిగా తేలడంతో కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. అనంతరం నిందితుడిని తిరుపతి జైలుకు తరలించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story