Tirupati: 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా యంత్రాంగం
Tirupati: తిరుపతి సమీపంలోని దామినేడులో నిర్వహించనున్న "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" సభ ఏర్పాట్లను కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు.
Tirupati: 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా యంత్రాంగం
Tirupati: తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద నిర్వహించనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం సందర్భంగా సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా అధికారులు గురువారం రాత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్,జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు,జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తదితర అధికారులు సభా స్థలాన్ని సందర్శించి ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు.
సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్, తాగునీరు,విద్యుత్,పారిశుధ్యం, భద్రతా చర్యలు,ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




