Lal Darwaza Bonalu : లాల్ దర్వాజా బోనాల్లో సందీప్ వంగ, విజయ్ దేవరకొండ సందడి..
Lal Darwaza Bonalu : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభతో వికసిస్తోంది. నగరంలోని ప్రముఖ ఆలయాలన్నీ
Vijay-Devarakonda
Lal Darwaza Bonalu : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభతో వికసిస్తోంది. నగరంలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తుల శోభాయాత్రలు, శివసత్తుల సిగాలు, పోతురాజుల విన్యాసాలతో కోలాహలంగా మారాయి. ఈ వేడుకల్లో సాధారణ భక్తులతో పాటు పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా విశేషంగా పాల్గొంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు 'రౌడీ స్టార్' విజయ్ దేవరకొండ భాగ్యనగర బోనాల ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయ్ వెంట ఆయన సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండతో పాటు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చారని తెలిసిన వెంటనే ఆయనను చూడటానికి, ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు, భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొనగా, అధికారులు, పోలీసులు ప్రత్యేక భద్రత నడుమ వారికి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు.




