Vemula Veeresham: హరీశ్ రావుకు అంత సీన్ లేదు.. దమ్ముంటే బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ అవ్వాలి: వేముల వీరేశం సవాల్!

Vemula Veeresham: బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Published on: 26 March 2026 2:08 PM IST
Vemula Veeresham
X

Vemula Veeresham: హరీశ్ రావుకు అంత సీన్ లేదు.. దమ్ముంటే బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ అవ్వాలి: వేముల వీరేశం సవాల్!

Vemula Veeresham: బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తుపై సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విమర్శించే నైతిక హక్కు హరీశ్ రావుకు లేదని మండిపడ్డారు.

సొంత పార్టీకే ప్రెసిడెంట్ కాలేరు.. సీఎం అవుతారా?

హరీశ్ రావును ఉద్దేశించి వేముల వీరేశం ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, ఆయనకు అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. "హరీశ్ రావుకు నిజంగా దమ్ముంటే ముందు తన సొంత పార్టీకి (BRS) అధ్యక్షుడై చూపించాలి. కనీసం పార్టీ ప్రెసిడెంట్ కాలేని వ్యక్తి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అవుతారు?" అని ప్రశ్నించారు. హరీశ్ రావు చేసేవి 'చిట్‌చాట్' మాటలు కావని, అవి ప్రజలను మోసం చేసే 'చీటింగ్' మాటలని ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రశంసలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును కొనియాడుతూ వేముల వీరేశం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను 'గుండు సున్నా' చేస్తామని చెప్పి మరీ చేసి చూపించిన దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. అసెంబ్లీ నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌ను రేవంత్ క్లీన్ స్వీప్ చేశారని, ఇప్పుడు దేశమంతా ఆయన వైపు చూస్తోందని అన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎంకు పూర్తి అవగాహన ఉందని, నియోజకవర్గాలు ఎలా మారినా వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకునే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story