Kishan Reddy: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్.. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు రెడీ!
Kishan Reddy: తెలంగాణ ప్రాజెక్టులకు తాను అడ్డుపడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.
Kishan Reddy: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్.. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు రెడీ!
Kishan Reddy: తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానంటు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై సీనియర్ జర్నిలిస్టులతో కమిటీ వేయాలని సీఎంకు సూచించారు. సీఎం హోదాలో ఉండి బెదిరింపు రాజకీయాలు చేయడం సరి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరులో పెద్ద తేడా లేదన్నారు. దేశ ప్రధానిగా అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా మోదీ రికార్డు సృష్టించబోతున్నారని కోనియాడారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకరిస్తోంది తెలిపారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తోంది వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధికి, ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.




