Karimnagar: మాటలే కాదు.. పాటలతోనూ మెప్పించిన కేంద్ర మంత్రి

Karimnagar: ఆర్ఎస్ఎస్ శత వసంతాల వేళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా పాడిన సంఘ గీతాల వీడియోలను కరీంనగర్‌లో విడుదల చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 3:33 PM IST
Karimnagar
X

Karimnagar: మాటలే కాదు.. పాటలతోనూ మెప్పించిన కేంద్ర మంత్రి

కరీంనగర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాను స్వయంగా పాడిన పాటల వీడియోలను విడుదల చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయ ఆవరణలో వేలాది మంది సమక్షంలో పాటల వీడియోలను విడుదల చేశారు.

మాటలే కాదు పాటలు అద్భుతం..

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాటలను ఆర్ఎస్ఎస్ సంఘ్ ప్రముఖు ఆకుల నాగేశ్వర్ రచించారు. ఈ పాటలకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత స్వరాలను అందించారు. అక్కడే ఉన్న భక్తులు ఈ పాటలను విని బండి సంజయ్ మాటలతోనే కాదు సంఘ గీతాలను సైతం పాడి అందరిని మెప్పించాలని అన్నారు.

చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలు..

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాను స్వయంగా పాటలు పాడడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను పాడిన పాటలను యాదృచ్ఛికంగా సీతారాముల కళ్యాణ సందర్భంగా విడుదల చేయడం చాలా అద్భుతమని ఇది కలకాలం గుర్తుండిపోయే ఘటన అన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story