Nizamabad: సిరికొండ అడవుల్లో పెద్ద పులి సంచారం.. అధికారుల వార్నింగ్!
Nizamabad: నిజామాబాద్ జిల్లా సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం. పులి అడుగుజాడలను నిర్ధారించిన ఆర్మూర్ డివిజన్ అధికారి భవాని శంకర్.
Nizamabad: సిరికొండ అడవుల్లో పెద్ద పులి సంచారం.. అధికారుల వార్నింగ్!
నిజామాబాద్ జిల్లా: సిరికొండ ఫారెస్ట్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఆర్మూర్ డివిజన్ అధికారి భవాని శంకర్ ఆధ్వర్యంలో పెద్ద పులి అడుగు జాడలను పరిశీలించారు. సిరికొండ రేంజ్ పరిధిలోని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఒంటరిగా పొలం పనులకు వెళ్లవద్దని.. గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఎవరికైన పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలిస్తే.. అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు.
Next Story




