Thimmapur: ఆర్టీసీ అధికారుల తీరుపై ఆగ్రహం.. బస్టాండ్‌లో విగ్రహాల వివాదం
Thimmapur: తిమ్మాపూర్ మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన డా. బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించాలని డిమాండ్.
Thimmapur: ఆర్టీసీ అధికారుల తీరుపై ఆగ్రహం.. బస్టాండ్‌లో విగ్రహాల వివాదం
Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలో గత మూడేళ్లక్రితం ఏర్పాటు చేసిన జగ్జీవన్ రాం, అంబేద్కర్ విగ్రహాలకున్న ముసుగులను తొలగించి ఏప్రిల్ 14 లోగా ఆవిష్కరించాలని తిమ్మాపూర్ మండలం లోని దళితబహుజన నాయకులు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.
ఈ సందర్బంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మాతంగి లక్ష్మణ్,బిసి సంఘ నాయకులు సుగుర్తి జగదీశ్వరాచారి లు మాట్లాడుతూ సమాజం లోని అన్నీ వర్గాల మధ్య సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు పోరాడిన బాబు జగ్జీవన్ రాం గొప్ప నాయకుడని కొనియాడారు.
మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించాలని గత మూడేళ్లుగా చేయని కార్యక్రమాలు లేవని, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ లను కూడా కలిసామని ఆవేదన వ్యక్తం చేసారు.ఆర్టీసీ అధికారుల బేషజాల చర్యలతో విగ్రహాలు నెలకొల్పిన ఆవరణ చెత్తా,చేదారంతో నిండిపోయి ఉన్నప్పటికీ కూడా అటువైపు వెళ్లకుండా కేసులు పెడతామని బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేడి అంజయ్య,మాతంగి శంకర్,వంతడ్పుల సంపత్,కన్నం లక్ష్మణ్,సంగుపట్ల మల్లేశం,సముద్రాల లక్ష్మణ్,వివిధ పార్టీలకు చెందిన దళిత బహుజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




