TGSRTC: సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు.. నేడు లేబర్ కమిషనర్‌తో కీలక చర్చలు..!

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లే యోచనలో ఉన్న కార్మిక సంఘాలు, నేడు లేబర్ కమిషనర్‌తో చర్చలు జరపనున్నాయి.

Arun Chilukuri
Published on: 13 April 2026 10:25 AM IST
TGSRTC
X

TGSRTC: సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు.. నేడు లేబర్ కమిషనర్‌తో కీలక చర్చలు..!

TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలు ఈరోజు లేబర్ కమిషనర్‌తో భేటీ కానుండటం రాజకీయంగా, పాలనాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు ప్రాథమికంగా నిర్ణయించాయి. కార్మికులు ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలకు పిలవకపోవడంపై జేఏసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేబర్ కమిషనర్‌తో జరిగే చర్చల అనంతరం సమ్మెపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు కార్మికుల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు విఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story