TG Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. ఉదయం 11 గంటలకే రిజల్ట్స్! వాట్సాప్‌లో చూసుకోండిలా
TG Inter Results 2026 Today: తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లో ఫలితాలు ఎలా పొందాలో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
TG Inter Results 2026 Today
Telangana Inter Results 2026 Today at 11 AM: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు (TG Inter Results 2026) నేడు విడుదల కానున్నాయి. ప్రథమ (TS Inter 1st Year Results 2026) మరియు ద్వితీయ (TS Inter 2nd Year Results 2026) సంవత్సరాల ఫలితాలను ఆదివారం ఉదయం 11 గంటలకు అధికారికంగా వెల్లడించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఫలితాల విడుదల వివరాలు:
ముందుగా ముఖ్యమంత్రి ఫలితాలను విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు మరియు విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థుల భవితవ్యం నేడు తేలనుంది.
ఫలితాలను పొందే విధానం:
1. అధికారిక వెబ్సైట్ ద్వారా:
విద్యార్థులు ఈ క్రింది వెబ్సైట్లలో తమ రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు:
2. వాట్సాప్ (WhatsApp) ద్వారా:
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నేరుగా వాట్సాప్‌లో ఫలితాలను పొందే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది:
♦ ముందుగా మీ ఫోన్లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోండి.
♦ వాట్సాప్‌లో ఈ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ చేయండి.
♦ ఆ తర్వాత వచ్చే ఆప్షన్లలో ‘BIE Exam Result’ అని టైప్ చేస్తే మీ ఫలితాలు ప్రత్యక్షమవుతాయి.
ముఖ్య గమనిక:
ఫలితాల విడుదల సమయంలో వెబ్సైట్లపై రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, విద్యార్థులు కంగారు పడకుండా వాట్సాప్ ఆప్షన్‌ను కూడా ప్రయత్నించవచ్చు.




