TG Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల
2026 TG Inter 1st, 2nd Year Result Released: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి.
TG Inter Results 2026: TGBIE 1st and 2nd Year Results Out
TGBIE 1st and 2nd Year Results Out: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు (TG Inter Results 2026) విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా కలిసి ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.
ముఖ్య అంశాలు:
♦ ఈ ఏడాది ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరాలకు కలిపి దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
♦ విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లలో చూడవచ్చు.
♦ పాస్ కావడానికి ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 35% మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఫలితాలు ఎలా చూసుకోవాలి?
♦ మొదట అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in సందర్శించండి.
♦ హోమ్ పేజీలో 'Inter 1st Year Results' లేదా 'Inter 2nd Year Results' లింక్‌పై క్లిక్ చేయండి.
♦ మీ హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
♦ మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
వెబ్‌సైట్లు మొరాయిస్తే విద్యార్థులు SMS ద్వారా లేదా డిజీ లాకర్ (DigiLocker) యాప్ ద్వారా కూడా తమ ఫలితాలను పొందే సదుపాయాన్ని బోర్డు కల్పించింది.




