TG 10th Class Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ ఎప్పుడంటే.?
TG 10th Class Results: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఎదురుచూస్తున్న ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.
TG 10th Class Results
TG 10th Class Results: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఎదురుచూస్తున్న ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. 2026 పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం పూర్తవడంతో ఫలితాల విడుదలపై విద్యాశాఖ వేగంగా చర్యలు చేపడుతోంది.
ఏప్రిల్ 16న ముగిసిన పరీక్షలు
ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 16తో పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించగా, లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే ఫలితాల ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు.
మూల్యాంకనం ప్రక్రియ పూర్తి
జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ ప్రారంభం నుంచే ప్రారంభమై, ఏప్రిల్ 25 నాటికి పూర్తయింది. ఈ ప్రక్రియలో పేపర్లను జాగ్రత్తగా పరిశీలించి మార్కులు కేటాయించారు. ప్రస్తుతం స్కానింగ్, డేటా ప్రాసెసింగ్ వంటి తదుపరి దశలు కొనసాగుతున్నాయి.
మార్కుల క్రోడీకరణ దశలో అధికారులు
మూల్యాంకనం పూర్తయ్యాక ముఖ్యమైన దశ మార్కుల క్రోడీకరణ (ట్యాబ్యులేషన్). ఈ ప్రక్రియ సాధారణంగా కొన్ని రోజులు పడుతుంది. ప్రస్తుతం దీనిని వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫలితాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫలితాల విడుదల తేదీ ఎప్పుడంటే?
అన్నీ సవ్యంగా జరిగితే మే మొదటి వారంలోనే ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 4 లేదా 5 తేదీల్లో అధికారికంగా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈసారి విద్యార్థులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉంది.
వాట్సాప్‌లో రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలి.?
* ఇందుకోసం ముందగా మీ ఫోన్‌లో 80969 58096 నెంబర్ సేవ్ చేసుకొని “Hi” మెసేజ్ పంపాలి.
* తర్వాత SSC Results ఆప్షన్ ఎంచుకోవాలి
* హాల్ టికెట్ నంబర్ నమోదు చేయాలి
* వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి




