Nizamabad: ఎమ్మెల్యేకు సవాల్.. వాడి గ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు

Nizamabad: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 11 April 2026 4:36 PM IST
Nizamabad
X

Nizamabad: ఎమ్మెల్యేకు సవాల్.. వాడి గ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు

Nizamabad: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామం వద్ద ఉద్రిక్తత. రూరల్ ఎమ్మెల్యేకు సవాల్ విసిరి చర్చకు వచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి. దినేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అడ్డుకున్న బిజెపి కార్యకర్తలు. దినేష్ ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు. గత ఆరు నెలల క్రితం భారీ వర్షాలకు ముత్యాలమ్మ చెరువు తెగి వరద కు గురియైనా గ్రామాల రైతులకు నష్టపరిహారం చెల్లించమన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి.

ఎంత మేర నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకున్నారో చర్చకు వాడి గ్రామం పెద్దమ్మ గుడి వద్దకు రావాలి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కొందరు బిజెపి నాయకులను ముందస్తు హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇప్పటికైనా రూరల్ ఎమ్మెల్యే వాడి గ్రామ రైతులకు నష్టపోయిన పంట నష్టం, ఆస్తి నష్టం కు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించాలని బిజెపి నాయకులు తెలిపారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story