Telangana: సమయం లేదు మిత్రమా.. ఇక 15 రోజులే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి

Telangana: తెలంగాణలోని వాహనదారులకు పోలీసులు అలర్ట్ జారీ చేశారు. మీ వాహనంపై పడే ట్రాఫిక్ చలానాలు, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందడానికి 'వాహన్' పోర్టల్‌లో.

Ravi
By Ravi
Published on: 16 Jun 2026 7:02 PM IST
Telangana
X

Telangana: సమయం లేదు మిత్రమా.. ఇక 15 రోజులే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. పెండింగ్ చలానాలు, ఇతర వాహన సంబంధిత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ఓ ముఖ్య సూచన చేశారు. వాహనదారులు తమ తాజా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని వెంటనే 'వాహన్' పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

ఇలా మీ కాంటాక్ట్ వివరాలు అప్‌డేట్ చేసుకోవడం వల్ల, మీ వాహనంపై పడే ట్రాఫిక్ చలానాలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని నేరుగా మెసేజ్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే సదుపాయం ఉంటుందన్నారు.

గడువు ఎప్పటివరకంటే?

ఈ వివరాలు నమోదు చేసుకోవడానికి వాహనదారులకు జూన్ 30 వరకు మాత్రమే గడువు ఉందని పోలీసులు మరోసారి గుర్తుచేశారు. వాహన్ పోర్టల్‌లో తమ వివరాలు పక్కాగా అప్‌డేట్ చేసుకుంటే, వాహనదారులు చలానాల నోటిఫికేషన్లతో ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని వివరించారు.

కాబట్టి, వాహనదారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గడువు ముగిసేలోపు 'వాహన్' పోర్టల్ ద్వారా తమ వివరాలను అప్‌డేట్ చేసుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story