School Holiday: విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు.. ఆ రోజు పాఠశాలలు బంద్!
School Holiday: మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆగస్టు 26న తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
School Holiday: విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు.. ఆ రోజు పాఠశాలలు బంద్!
School Holiday: మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ సెలవు ప్రకటించింది. ఆగస్టు 26, 2026 (బుధవారం) రోజున రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలు (పాఠశాలలు, కళాశాలలు), ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ అధికారిక క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 26వ తేదీని జనరల్ హాలిడేగా వర్గీకరించారు. దీంతో విద్యాసంస్థలతో పాటుగా ప్రభుత్వ అనుబంధ సంస్థలన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుంది.
ఇదే నెలలో ఆగస్టు 21న (వరలక్ష్మీ వ్రతం), ఆగస్టు 28న (శ్రావణ పౌర్ణమి / రాఖీ పౌర్ణమి) రోజులను ఐచ్ఛిక సెలవులు (Optional Holidays)గా ప్రభుత్వం క్యాలెండర్‌లో పేర్కొంది.
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా భాగ్యనగరంలో మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఊరేగింపు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. విజయనగర్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఉచిత రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలను ముస్లిం సోదరులు ప్రారంభించారు.




