Dial 112: తెలంగాణలో 'డయల్ 100' స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్..!

Dial 112: తెలంగాణలో ఇకపై డయల్ 100 స్థానంలో ఒకే ఎమర్జెన్సీ నంబర్ 112 అందుబాటులోకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 1:19 PM IST
Dial 112
X

Dial 112: తెలంగాణలో 'డయల్ 100' స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్..!

Dial 112: తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ప్రజలు ఉపయోగిస్తున్న 'డయల్ 100' స్థానంలో ఇకపై అన్ని ఎమర్జెన్సీ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ 'డయల్ 112' నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (DGP) సీవీ ఆనంద్ ఈ నూతన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ నంబర్‌ను అధికారికంగా ప్రారంభించారు.

పోలీస్ (100), అంబులెన్స్ (108), అగ్నిమాపక శాఖ (101) వంటి వేర్వేరు నంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా, బాధితులు ఇకపై '112' కు కాల్ చేస్తే సరిపోతుంది. కాల్ వచ్చిన వెంటనే సంబంధిత విభాగానికి (పోలీస్, ఫైర్ లేదా మెడికల్) సమాచారాన్ని వేగంగా చేరవేసి, లొకేషన్ ఆధారంగా వేగంగా సహాయం అందించేలా ఈ సిస్టమ్‌ను డిజైన్ చేశారు. ఆపదలో ఉన్న మహిళలు, వయోవృద్ధులు, పిల్లల అత్యవసర రక్షణ కోసం ఈ సిస్టమ్‌ను సరికొత్త టెక్నాలజీతో అనుసంధానించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story