Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

Rain Alert: తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.

Arun Chilukuri
Published on: 27 May 2026 12:11 PM IST
Revanth Reddy
X

Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

Rain Alert: వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో, వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని అన్నారు.

బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story