Telangana Police Recruitment 2026: పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

Telangana Police Recruitment 2026: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 10:47 AM IST
Telangana Police Recruitment 2026
X

Telangana Police Recruitment 2026: పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

Telangana Police Recruitment 2026: తెలంగాణలో ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తులు కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు అందించిన నివేదికల నేపథ్యంలో సీఎం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణ, రవాణా నుంచి పరీక్షల నిర్వహణ వరకు ప్రతి దశలోనూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. నియమ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను పెంచడంతో పాటు, నియామక ప్రక్రియ ముగిసే వరకు కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక కన్ను ఉంచాలని సూచించారు.

సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా పరీక్షలపై అసత్య ప్రచారాలు, గందరగోళం సృష్టించే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, వ్యాజ్యాకర సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story