Telangana New Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్ల వెరిఫికేషన్.. పూర్తి వివరాలు
Telangana New Pensions: తెలంగాణలో చేయూత కొత్త పెన్షన్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రారంభమైంది. అర్హత పరిశీలన, మంజూరు ప్రక్రియ వివరాలు ఇవే.
Telangana New Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్ల వెరిఫికేషన్.. పూర్తి వివరాలు
Telangana New Pensions: తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైంది. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తున్నారు. దరఖాస్తుదారుల సామాజిక, ఆర్థిక పరిస్థితులతో పాటు నివాస స్థితి, వారు కోరుకున్న పెన్షన్ కేటగిరీకి అర్హులా? కాదా? అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు.
మొబైల్ యాప్‌లో వివరాల నమోదు
క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో అధికారులు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 25వ తేదీలోపు క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ల ఆమోదం తర్వాత పెన్షన్లు
క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మొబైల్ యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా అర్హులైన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తారు. ఈ జాబితాను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు (DRDO) పరిశీలించి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపిస్తారు.
కలెక్టర్లు తుది జాబితాను పరిశీలించి ఆమోదించిన తర్వాత అర్హులైన వారికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అనర్హులకు అవకాశం లేకుండా నిజమైన అర్హులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.




