హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తక్షణమే తప్పించండి.. సీఎస్‌కు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు!

Telangana High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు. కోర్టు ధిక్కరణ నేపథ్యంలో ఆయనను తక్షణమే బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశం.

Arun Chilukuri
Published on: 31 July 2026 5:45 PM IST
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తక్షణమే తప్పించండి.. సీఎస్‌కు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు!
X

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తక్షణమే తప్పించండి.. సీఎస్‌కు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు!

Telangana High Court: హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ వ్యవహారశైలిపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన వివాదాస్పద భూముల కేసులో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు గాను, ఆయనను కమిషనర్ బాధ్యతల నుంచి తక్షణమే బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)ని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

సికింద్రాబాద్ లోతుకుంటలోని భూముల వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ఆదేశాలను స్పష్టంగా ఉల్లంఘించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, భారీ సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్ధమని కోర్టు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేసి, ఆయన స్థానంలో మరొక అధికారిని నియమించాలని సీఎస్‌కు సూచించింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో 'టాటా మోహన్‌రావు' కేసులో ఇచ్చిన తీర్పును హైకోర్టు ఉదహరించింది. సమాజంలో చట్టపాలన (Rule of Law) మాత్రమే కొనసాగాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని పక్కనపెట్టి వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే అది ప్రజాస్వామ్యానికే మరణశాసనం అవుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. హైకోర్టు తీర్పుతో ఇప్పుడు హైడ్రా తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story