AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్!

AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.

Arun Chilukuri
Updated on: 27 July 2026 4:29 PM IST
AV Ranganath
X

AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్!

AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు తీవ్ర షాక్ ఇచ్చింది. ఆయనను వెంటనే హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రంగనాథ్ స్థానంలో వేరే అర్హత కలిగిన అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.

కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఇప్పటికే ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక ఉన్నతాధికారి హోదాలో ఉండి న్యాయస్థాన ఉత్తర్వులను పదేపదే ధిక్కరించడం, బేఖాతరు చేయడం ఏమాత్రం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఎంతటి ఉన్నతాధికారి అయినా చట్టానికి, న్యాయస్థానాల ఆదేశాలకు లోబడి పనిచేయాల్సిందేనని, కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది.

కోర్టు ఉత్తర్వుల అమల్లో నిర్లక్ష్యం వహించడం, వరుసగా ధిక్కరణ అభియోగాలు ఎదుర్కోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం, రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌ పోస్టు నుంచి తక్షణమే తప్పించాలని తుది ఆదేశాలు ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story