Ponguleti Srinivas Reddy: వచ్చే 3 రోజులు అలర్ట్.. వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి పొంగులేటి!

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో భానుడి భగభగలు.. రాబోయే 3 రోజులు అత్యంత కీలకం! ఎండలు, వడగాలుల తీవ్రతపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యవసర సమీక్ష.

Arun Chilukuri
Published on: 23 May 2026 3:47 PM IST
Ponguleti Srinivas Reddy
X

Ponguleti Srinivas Reddy: వచ్చే 3 రోజులు అలర్ట్.. వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి పొంగులేటి!

Ponguleti Srinivas Reddy: రాష్ట్రంలో ఎండలు, వడగాలుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నందున రాబోయే మూడు రోజుల పాటు ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఎండల పరిస్థితి, ముందస్తు జాగ్రత్తలపై మంత్రి ఈరోజు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ని ప్రధాన బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రయాణికుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా మజ్జిగ, ఓఆర్‌ఎస్ (ORS) ప్యాకెట్లను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో వడదెబ్బ (Sunstroke) కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం (పరిహారం) అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అంతా అలర్ట్‌గా ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story