Govt Jobs: నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. దేవాదాయ శాఖ‌లో ఈఓ పోస్టుల భ‌ర్తీ

Govt Jobs: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో మంచి అవకాశం సిద్ధమవుతోంది. రాష్ట్ర దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Mokshith
Published on: 5 May 2026 12:35 PM IST
Govt Jobs
X

Govt Jobs

Govt Jobs: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో మంచి అవకాశం సిద్ధమవుతోంది. రాష్ట్ర దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మొత్తం ఖాళీలు – 190 పోస్టుల భర్తీ

దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల పరిపాలనను బలోపేతం చేయడానికి ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జోన్లు, జిల్లాల్లో ఖాళీలను గుర్తించి మొత్తం 190 EO పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. గ్రేడ్ వారీగా ఈ పోస్టులను విభ‌జించ‌నున్నారు.

చార్మినార్ జోన్‌లో ఎక్కువ పోస్టులు

చార్మినార్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాలకు గణనీయమైన సంఖ్యలో పోస్టులు కేటాయించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి 67 పోస్టులు భర్తీ చేయనున్నారు.

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ జిల్లా విష‌యానికొస్తే గ్రేడ్-1: 5, గ్రేడ్-2: 4, గ్రేడ్-3: 14 పోస్టులున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో గ్రేడ్-1: 1

గ్రేడ్-3: 6 పోస్టులున్నాయి. మేడ్చల్ జిల్లా విష‌యానికొస్తే గ్రేడ్-2: 7, గ్రేడ్-3: 6 ఉన్నాయి. అలాగే వికారాబాద్ జిల్లాలో

గ్రేడ్-2: 5, గ్రేడ్-3: 4 పోస్టులున్నాయి. సంగారెడ్డి జిల్లా గ్రేడ్-1: 4, గ్రేడ్-2: 1 ఉన్నాయి.

త్వరలో విడుదల కానున్న అధికారిక నోటిఫికేషన్

ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడవుతాయి. ఇందులో అర్హతలు (విద్యార్హతలు), వయస్సు పరిమితులు, ఎంపిక విధానం (రాత పరీక్ష/ఇంటర్వ్యూ), పరీక్షా సిలబస్, దరఖాస్తు విధానం, అప్లికేషన్ తేదీలు వంటి వివ‌రాల‌న్నీ ఉండ‌నున్నాయి. అభ్యర్థులు ఈ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది.

EO ఉద్యోగం అంటే ఏమిటి? బాధ్యతలు ఏంటి?

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) ఆలయ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు. ఆలయ ఆర్థిక వ్యవహారాలు, రోజువారీ నిర్వహణ, పూజా కార్యక్రమాల సమన్వయం వంటి బాధ్యతలు EOపై ఉంటాయి. భక్తులకు మెరుగైన సేవలు అందేలా చూడటం కూడా వారి ముఖ్య బాధ్యతల్లో ఒకటి.

ఉద్యోగార్థులకు ఎందుకు మంచి అవకాశం?

దేవాదాయ శాఖలో ఉద్యోగం అంటే స్థిరత్వం, గౌరవం రెండూ కలిసిన సేవ. ప్రభుత్వ ఉద్యోగ భద్రతతో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ పోస్టుల‌కు భారీ పోటీ ఉండే నేపథ్యంలో ఈసారి ముందుగానే సిద్ధం కావడం అభ్యర్థులకు ఉపయోగపడుతుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story