Telangana Assembly: స్పీకర్ సంచలన ప్రకటన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ సభ్యులందరినీ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు.
Telangana Assembly: స్పీకర్ సంచలన ప్రకటన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్
Telangana Assembly: తెలంగాణ శాసనసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సెషన్ ముగిసే వరకు బీఆర్ఎస్ సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సభ ప్రారంభమైన వెంటనే 'వీ వాంట్ జస్టిస్' అంటూ బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించగా.. స్పీకర్ దాన్ని ఆమోదించారు.
సస్పెన్షన్‌కు గురైన ప్రముఖులలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సెషన్ ముగిసే వరకు వీరంతా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నారు.




