Tandur: గ్రామ స్థాయి నుంచే పాలన - తాండూరు నియోజకవర్గంలో ప్రగతి బాట!

Tandur: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గౌతపూర్‌లో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 4:42 PM IST
Tandur
X

Tandur: గ్రామ స్థాయి నుంచే పాలన - తాండూరు నియోజకవర్గంలో ప్రగతి బాట!

Tandur: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ స్పష్టమైన మార్పు తేవాలనేదే ప్రభుత్వంఉద్దేశమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన_ప్రగతి ప్రణాళిక - 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా గౌతపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందించాలని, ప్రజలకు మరింతగా సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి మార్చి 9 నుండి జూన్ 02 వరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక`అనే పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఉద్యమంలా కొనసాగుతుందని చెప్పటానికి సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ప్రజా అవసరాలకు అనుగుణంగా సంక్షేమ,అభివృద్ధి రెండు కూడా జోడెద్దుల వలె తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పడానికి గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు.

ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 290 కోట్ల మంది మహిళలు ప్రయాణించి, పదివేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,రూ. 500 కే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు,సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారిక పై వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకేజీ, రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు ఇలా ఏ సంక్షేమ పథకం తీసుకున్న ప్రజల ఆనందమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.

తాండూర్ నియోజవర్గంలో రవాణా,విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడడమే ధ్యేయంగా ఎమ్మెల్యేగా నేను, గ్రామ స్థాయి మా సర్పంచ్ లు, కౌన్సిలర్స్ అందరూ సేవలందించడం జరుగుతుందని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story