Tandur: తాండూరులో లారీ బీభత్సం: సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్ పైకి.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం!
Tandur: వికారాబాద్ జిల్లా తాండూరులో నాపరాతి లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన లారీ ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లింది.
Tandur: తాండూరులో లారీ బీభత్సం: సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్ పైకి.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం!
Tandur: అతివేగంలో ఉన్న ఓ లారీ బీభత్సం సృష్టించింది. నడిరోడ్డుపై ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొడుతూ డివైడర్ల మీదికి దూసుకెళ్లింది. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన బుధవారం ఉదయం తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. కొడంగల్ వైపు నుంచి చించోలి వైపు నాపరాతి లోడు తో తాండూరు మీదుగా వస్తుంది. పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటగానే వేగంలో ఉన్న లారీ నడిరోడ్డుపై ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీ కొట్టి.. డివైడర్ల మీదికి దూసుకు వెళ్ళింది.
డివైడర్ ల మీద ఉన్న ఇనుప రాడులను ధ్వంసం చేసింది. ఈ సమయంలో రోడ్డు మీద ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా..? లేదా వేగం అదుపు కాలేదా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. లారీ బీభత్సానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. లారీ వద్దకు చేరుకొని ఎవరికైనా ప్రమాదం జరిగిందా అని పరిశీలించారు. విషయాన్ని తాండూరు పట్టణ పోలీసులకు తెలిపారు.




