Tandur: తాండూరు అభివృద్ధి లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మార్క్

Tandur: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ₹2.81 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరయ్యాయి.

SRIKANTH, TANDUR
Published on: 3 April 2026 4:58 PM IST
Tandur
X

Tandur: తాండూరు అభివృద్ధి లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మార్క్

Tandur: వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గానికి రూ. 2.81 కోట్లు నిధులు మంజూరుకావడం జరిగిందని టీపీసీసీ రాష్ట్ర ప్రచార సమన్వయకర్త(కోఆర్డీనేటర్) కరణం పురుషోత్తం రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్స్(ఎస్డీఎఫ్‌) కింద ఈ నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు. తాండూరు పట్టణం, బషీరాబాద్‌ మండలాల్లో మొత్తం 16 పనుల కోసం నిధులు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ఇందులో కుల సంఘాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ముదిరాజ్ భవన నిర్మాణానికి రూ. 50లక్షలు, కురుమ భవనంకు రూ. 50లక్షలు, బ్రహ్మాణ భవనంకు రూ. 25లక్షలు, విలియమూన్‌ స్కూల్ ప్రహారి నిర్మాణంకు రూ. 25లక్షలు, రేవణ సిద్దేశ్వర దేవాలయ మందిర నిర్మాణంకు రూ. 7లక్షలు, వార్డు నెంబర్ 22లో స్కూల్ భవనంకు రూ. 35లక్షలు, మైనార్టీ భవనంకు రూ. 25లక్షలు, చెన్‌గెష్‌పూర్ ఈద్గాలో ప్రహారి నిర్మాణంకు రూ. 10లక్షలు, ఖాంజాపూర్ గేటు వద్ద ఉన్న ఈద్గాలో కమ్యునిటీ హాల్‌ ప్రహారికి రూ. 5లక్షలు, ముర్షద్‌ దర్గా సమీపంలోని స్మశాన వాటికకు రూ. 5లక్షలు, బోనమ్మ గుడి వద్ద ఉన్న స్మశాన వాటిక మరమ్మత్తులకు రూ. 5లక్షలు, బసవణ్ణ కట్ట షెడ్‌ నిర్మాణంకు రూ.1లక్ష కేటాయించడం జరిగిందని వివరించారు.

అదేవిధంగా బషీరాబాద్‌ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రహారికి రూ. 9లక్షలు, మండలంలోని ఎక్మాయి ప్రామంలో ఫార్మేషన్ రోడ్డుకు రూ. 10లక్షలు, మైల్వార్ గ్రామంలో ఫార్మేషన్ రోడ్డుకు రూ. 9లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. తాండూరులో కుల సంఘాలకు, గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

SRIKANTH, TANDUR

SRIKANTH, TANDUR

Next Story