Stree Nidhi Jobs: మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. స్త్రీ నిధి సంస్థ‌లో ఉద్యోగాలు

Stree Nidhi Jobs: తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి పనిచేస్తున్న స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

Mokshith
Published on: 12 May 2026 3:23 PM IST
Stree Nidhi Jobs
X

Stree Nidhi Jobs: మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. స్త్రీ నిధి సంస్థ‌లో ఉద్యోగాలు

Stree Nidhi Jobs: తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి పనిచేస్తున్న స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అసిస్టెంట్ మేనేజర్ (ఫీల్డ్ ఆపరేషన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి?

ఈ నియామకాల్లో వివిధ వర్గాలకు పోస్టులను కేటాయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓసీ – 60 పోస్టులు

ఈడబ్ల్యూఎస్ – 3 పోస్టులు

బీసీ-ఏ – 16 పోస్టులు

బీసీ-బి – 2 పోస్టులు

ఓహెచ్ – 9 పోస్టులు

ఎస్సీ గ్రూప్-1 – 4 పోస్టులు

ఎస్సీ గ్రూప్-2 – 26 పోస్టులు

ఎస్టీ – 3 పోస్టులు

ఈ పోస్టులను జిల్లా స్థాయిలో భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఫీల్డ్ లెవల్‌లో స్వయం సహాయక సంఘాలతో పని చేయాల్సి ఉంటుంది.

అర్హతలు ఏమిటి?

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికే ఈ అవకాశం వర్తిస్తుంది. అలాగే.. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడటం, చదవడం, రాయడం రావాలి. కంప్యూటర్‌లో ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి. స్కూటీ లేదా బైక్‌తో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయోపరిమితి 25 నుంచి 30 ఏళ్ల మధ్యగా నిర్ణయించారు. బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మే 29, 2026 రాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. అప్లికేషన్ ఫీజు విష‌యానికొస్తే.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు – రూ.770, ఇతర కేటగిరీలు – రూ.885 చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు.?

అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 25 మార్కులు, రీజనింగ్ – 25 మార్కులు

ఇంగ్లిష్ – 25 మార్కులు, బ్యాంకింగ్ & జనరల్ అవేర్‌నెస్ – 25 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు నెగిటివ్ స్ట్రోక్ ఉంటుంది.

జీతం, ఇతర ప్రయోజనాలు

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.33,960 వేతనం అందుతుంది. అదనంగా ట్రావెల్ అలవెన్స్, పనితీరు ఆధారిత వేరియబుల్ పే వంటి ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత కోసం పనిచేసే సంస్థలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story