Armoor: మిన్నంటిన రామనవమి సంబరాలు.. సిద్ధులగుట్టలో ప్రత్యేక పూజలు

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్ధులగుట్ట పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 4:19 PM IST
Armoor
X

Armoor: మిన్నంటిన రామనవమి సంబరాలు.. సిద్ధులగుట్టలో ప్రత్యేక పూజలు

Armoor: ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించు కున్నాయి. ఆయా ఆలయాల లో వేద పండితులు సీతారామ కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.

పట్టణంలోని రామాలయం తో, సిద్ధులగుట్ట పుణ్యక్షత్రంలో జరిగిన ప్రత్యేక పూజాకార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. సిద్దులగుట్ట పై శోభాయమానంగా జరిగిన రాములోరి కల్యాణానికి జీవన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు జీవన్ రెడ్డిని శాలువతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, టిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు, పట్టణ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story