Karimnagar: కరీంనగర్‌లో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో రాములోరి ఎదుర్కోలు!
Karimnagar: కరీంనగర్ సప్తగిరి కాలనీ శ్రీ కోదండ రామాలయ కళ్యాణోత్సవాల్లో భాగంగా డాక్టర్ వి. నరేందర్ రెడ్డి స్వగృహంలో ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా జరిగింది.
Karimnagar: కరీంనగర్‌లో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో రాములోరి ఎదుర్కోలు!
కరీంనగర్: శ్రీ సీతరాముని కళ్యాణ మహోత్సవం జగత్తుకు గొప్ప వేడుక అని మరియు భక్తి పారవశ్యానికి వేదికని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.
సప్తగిరి కాలనీలోని గల శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించబోయే శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని వారి స్వగృహంలో నిర్వహించినటువంటి ఎదుర్కోలు మహోత్సవానికి ప్రధాన కర్తగా హాజరై ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రామ నామాన్ని జపించి తరించండి..
ఈ సందర్భంగా వారు ప్రజలందరికీ ముందస్తుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసి ప్రతి ఒక్కరూ రామ నామాన్ని జపించాలని మరియు శుభ ఫలాలు పొందాలని కోరారు. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీరామ నవమి రోజున జరిగే సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగే విధంగా అన్ని ఆలయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాములోరి కళ్యాణ వేడుకల్లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షులు గౌతమ్ రావు , ఆలయ కమిటీ సభ్యులు తుమ్మల రమేష్ రెడ్డి , పి రాజిరెడ్డి , శ్రీహారిరెడ్డి , జి.రాజిరెడ్డి , పివి మాధవ్ రాజు , ప్రధాన అర్చకులు రామాచార్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.




