Karimnagar: శ్రీ చైతన్య స్కూల్‌లో అట్టహాసంగా వార్షికోత్సవ వేడుకలు
Karimnagar: కరీంనగర్ చింతకుంట శ్రీ చైతన్య సీబీఎస్ఈ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Karimnagar: శ్రీ చైతన్య స్కూల్‌లో అట్టహాసంగా వార్షికోత్సవ వేడుకలు
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో చింతకుంట లో ఉన్న శ్రీ చైతన్య సీబీఎస్ఈ ఐపీఎల్ ఐసి బ్రాంచ్ లో ఘనంగా అన్యువల్ డే వేడుకలు జరిగాయి. సభ అధ్యక్షలు సీబీఎస్ఈ ఐపీఎల్ ఐసి ప్రిన్సిపల్ రాజుకుమార్ ఆచార్య వేదికపైకి ముఖ్య అతిధుల ఆహ్వానించి యాన్యువల్ డే ప్రోగ్రాం ని ప్రారంభించారు.ఈ కార్యక్రమని ముఖ్య అతిథిగా గౌస్ అలం కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఎసిపి విజయ్ కుమార్ , ట్రాఫిక్ సిఐ సంజీవ్ , 15వ డివిజన్ కార్పొరేటర్ సాయి జ్యోతి విష్ణు , ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విద్యార్థుల్లో మానసిక, శారీరక అభివృద్ధి కృషి..
శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ , డైరెక్టర్ మల్లంపాటి శ్రీవిద్య , కరీంనగర్ జోన్ ఏజీఎం రాజు , మంచిర్యాల జోన్ ఏజీఎం అరవింద్ రెడ్డి , ఏజీఎం ఆపరేషన్ సదాశివ రెడ్డి ,స్టేట్ అకాడమిక్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ జయరాజు , జోనల్ అకాడమీ కోఆర్డినేటర్ ప్రవీణ్ , ఏవో హరికృష్ణ రెడ్డి శ్రీ చైతన్య రెండవ అన్యువల్ డే, సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ పాల్గొన్న నర్సరీ నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులు విద్యార్థులందరికీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ అన్యువల్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం విద్యార్థుల్లో మానసికంగానే కాకుండా శారీరక అభివృద్ధి కూడా తోడ్పడాలని తెలియజేశారు. విద్యార్థుల్లో కల్చరల్ ఆక్టివిటీస్ పెంపొందిస్తూ అటు చదువుల్లోనూ ఇటు ఆటల్లోనూ ఇటు పాటల్లోనూ మంచి ప్రతిభ కనబరిచారని తెలియజేశారు.
చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందు..
ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య డైరెక్టర్ సీమ, జిఎం నాగేంద్ర, ఈరోజు యానిమల్ డే సందర్భంగా శ్రీ చైతన్య విద్యార్థులంటే కేవలం చదువులకే పరిమితం కాకుండా ఇటు ఆటలోనూ పాటల్లోను మా విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రతి ఏటా పదవ తరగతి ఫలితాల్లోనూ, ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ, ఆల్ ఇండియా పోటీ పరీక్షల్లోనూ ఎక్కడ చూసినా శ్రీ చైతన్య విద్యార్థులు కనబడుతున్నారు.
దాని ఉద్దేశం మా విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రత్యేక ఉత్తమమైన భవిష్యత్తుని కాకుండా ప్రతి రంగంలోనూ మా శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాము. రాబోయే రోజులలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్యతోపాటు మానసికంగా అభివృద్ధి చేసే విధంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమానికి ఏడు బ్రాంచ్ల నుండి 5000 మంది విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు సహకరించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చింతకుంట ప్రైమరీ ప్రిన్సిపల్ నీలిమారావు, వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపల్ సుమన్, కుమార్, రవీందర్ రెడ్డి, తిరుమల్, పద్మజ, శ్రీజ,వైస్ ప్రిన్సిపాల్ గోవర్ధన్, బోయవాడ, తిమ్మాపూర్, వావిలలాపల్లి, మల్కాపూర్, సుల్తానాబాద్, విద్యారణ్యపురి, శ్రీ సౌధ,, డీన్స్, జోనల్ పిఈటీలు శ్రీకాంత్, సాగర్, ఔట్సోర్సింగ్ జోనల్ ఇంచార్జ్ శ్రీకాంత్,ఇన్చార్జీలు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పి ఈ టి లు, విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.




