Pebbair: పెబ్బేరులో చలివేంద్రం ప్రారంభం వేసవిలో ప్రజలకు ఊరట!
Pebbair: వనపర్తి జిల్లా పెబ్బేరులో వేసవి తాపాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ప్రారంభించారు.
Pebbair: పెబ్బేరులో చలివేంద్రం ప్రారంభం వేసవిలో ప్రజలకు ఊరట!
Pebbair: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో చలివేంద్రం మరియు అంబలి కేంద్రాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు, శీతల పానీయాలు అందించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలను అభినందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, నాలుగో వార్డ్ కౌన్సిలర్ జమ్ములమ్మ, పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దుల విజయ వర్ధన్ రెడ్డి తదితర పట్టణ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
Next Story




