BJP MLAs: సింగరేణి గనుల్లో నేడు బీజేపీ బృందం పర్యటన.. బొగ్గు కుంభకోణంపై క్షేత్రస్థాయి పరిశీలన!

BJP MLAs: సింగరేణి బొగ్గు కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.

Arun Chilukuri
Published on: 19 Jun 2026 10:36 AM IST
BJP MLAs
X

BJP MLAs: సింగరేణి గనుల్లో నేడు బీజేపీ బృందం పర్యటన.. బొగ్గు కుంభకోణంపై క్షేత్రస్థాయి పరిశీలన!

BJP MLAs: సింగరేణి బొగ్గు కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ వ్యవహారంలో వాస్తవాలను తేల్చేందుకు బీజేపీ క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ‎ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సింగరేణి గనుల్లో పర్యటించనుంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించనుంది.

హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న బీజేపీ నేతల బృందం 11 గంటలకు మంచిర్యాలలోని సింగరేణి గెస్ట్ హౌస్ కు చేరుకోనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాంపూర్ ఓపెన్ మైన్, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు SRP-3 మైన్ ను సందర్శించి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిశీలించనుంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story