Karimnagar: న్యాయవాదుల హక్కుల పోరాటంలో బార్ అసోసియేషన్ ది కీలక పాత్ర!
Karimnagar: కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సర్ధార్ రవీందర్ సింగ్. న్యాయవాదుల సంక్షేమం కోసం కొత్త నాయకత్వం కృషి చేయాలని ఆశాభావం.
Karimnagar: న్యాయవాదుల హక్కుల పోరాటంలో బార్ అసోసియేషన్ ది కీలక పాత్ర!
కరీంనగర్: కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ , న్యాయవాది నారదాసు లక్ష్మణ్ తో కలసి ఓటు హక్కు వినియోగించుకున్న కరీంనగర్ జిల్లా మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , కరీంనగర్ నగర మాజీ మేయర్ , 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్.
ఈ సందర్భంగా సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ కరీంనగర్‌లో నిర్వహిస్తున్న ఎన్నికలు న్యాయవాదుల ఐక్యతను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు.
న్యాయవాదుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ కోసం బార్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించబడటం అభినందనీయమని తెలిపారు.తన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామిగా నిలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచే నాయకత్వం న్యాయవాదుల సంక్షేమం , సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.




