Rajanna Sircilla: నిబంధనలు వద్దు - నిధులు కావాలి బోయిన్‌పల్లిలో సహారా బాధితుల ఆవేదన

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లిలో సహారా ఇండియా బాధితుల భారీ ధర్నా. సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 1:25 PM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: నిబంధనలు వద్దు - నిధులు కావాలి బోయిన్‌పల్లిలో సహారా బాధితుల ఆవేదన

రాజన్న సిరిసిల్ల జిల్లా (బోయిన్ పల్లి): మండల కేంద్రంలో సహారా ఇండియా గ్రూప్‌లో డిపాజిట్ చేసిన బాధితుల ఆవేదన మరోసారి బయటపడింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ముందు భారీగా ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. తమ కష్టార్జిత సొమ్ము సహారా కంపెనీలో పెట్టుబడి పెట్టినప్పటికీ, గడువు ముగిసిన తర్వాత కూడా డబ్బులు తిరిగి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనవసర నిబంధనలు, షరతులు విధిస్తూ డిపాజిటర్లను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఎలాంటి షరతులు లేకుండా వెంటనే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో సహారా బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్. రైతు సంఘం నాయకులు రామంచ అశోక్. సిపిఎం పార్టీ నాయకులు కుడుకల గిరిబాబు.దూస జనార్ధన్. సహారా బాధితులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story