Amanagal: ఆమనగల్ వద్ద ఘోర ప్రమాదం అధికారుల నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా?
Amanagal: హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఆమనగల్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టడంతో చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Amanagal: ఆమనగల్ వద్ద ఘోర ప్రమాదం అధికారుల నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా?
Amanagal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపల్ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బైకును ఢీ కొట్టింది. బైక్‌పై ఉన్న వ్యక్తి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడు మంగళపల్లి గ్రామపంచాయతి పరిధిలోని చెన్నకేశవ కాలానికి చెందిన చరణ్‌గా గుర్తించారు. రోడ్డు పనుల్లో జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




