Ramachandra Rao: బీజేపీ కార్యకర్తలు తలచుకుంటే మీ వాళ్లు గ్రామాల్లో తిరగలేరు.. రామచందర్‌రావు వార్నింగ్!
Ramachandra Rao: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Ramachandra Rao: బీజేపీ కార్యకర్తలు తలచుకుంటే మీ వాళ్లు గ్రామాల్లో తిరగలేరు.. రామచందర్‌రావు వార్నింగ్!
Ramachandra Rao: కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని పొలిమేర దాటనీయబోమంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలు గనుక తలచుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరూ గ్రామాల్లో తిరగలేరని ఆయన హెచ్చరించారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మార్కెట్ నిర్మాణాల కోసం భూములు త్యాగం చేస్తున్న రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. "స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. మొండిగా కోహెడ పండ్ల మార్కెట్‌కు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించిన తర్వాతే పండ్ల మార్కెట్ పనులను ప్రారంభించాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యంగా రైతుల భూములను కాజేస్తున్నారు. మరోవైపు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకుండా రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు" అని ఆయన మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్న విషయాన్ని రామచందర్‌రావు స్పష్టం చేశారు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఇప్పటివరకు తెలంగాణకు ఏకంగా రూ. 13 లక్షల కోట్ల నిధులను కేటాయించామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై, కేటాయింపులపై తాము సచివాలయం (Secretariat) వద్ద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.




