Sircilla: మిడ్ మానేరు 10 గేట్లు ఎత్తివేత.. దిగువకు నీటి విడుదల!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు జలాశయం నుండి 10 గేట్లు ఎత్తి 3310 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Sircilla: మిడ్ మానేరు 10 గేట్లు ఎత్తివేత.. దిగువకు నీటి విడుదల!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు జలాశయం నుంచి ప్రస్తుతం నీటి విడుదల కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 9 గంటల సమయానికి జలాశయంలో నీటి మట్టం 309.70 అడుగులుగా నమోదైంది. పూర్తి స్థాయి 318 అడుగులు కాగా, ప్రస్తుతం 10.912 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇన్‌ఫ్లోలు లేకపోయినప్పటికీ, నీటి మట్టాన్ని నియంత్రించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జలాశయం నుంచి మొత్తం 3310 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇందులో భాగంగా 25 స్పిల్‌వే గేట్లలో 10 గేట్లు తెరిచి, ప్రతి గేటును అర్ధ మీటర్ ఎత్తులో ఎత్తి నీటిని వదులుతున్నారు. అలాగే రైట్ గేట్ల ద్వారా, రైట్ మైన్ కాల్వ, ఇతర మార్గాల ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది.
Next Story




