Palwancha: మేము లొంగం.. డిమాండ్లు తీరేదాకా సమ్మె విరమించం.. ఆర్టిజన్లు

Palwancha: పాల్వంచ KTPS వద్ద విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె ఉధృతమైంది. నాలుగో రోజు విధులను బహిష్కరించిన కార్మికులు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 11 April 2026 4:23 PM IST
Palwancha
X

Palwancha: మేము లొంగం.. డిమాండ్లు తీరేదాకా సమ్మె విరమించం.. ఆర్టిజన్లు

Palwancha: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మె నేటితో నాలుగో రోజుకు చేరుకుంది. జేఏసీ (JAC) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిజన్, అన్‌మ్యాన్డ్, పీ-సెట్ కార్మికులు తమ విధులను బహిష్కరించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ KTPS వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గతంలో ఎన్.ఎం.ఆర్ (NMR), మజ్దూర్ కార్మికులను పర్మనెంట్ చేసిన విధంగానే తమకు కూడా APSEB సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి. విద్యార్హతలను బట్టి ఉద్యోగ కన్వర్షన్ కల్పించాలి, పీ-సెట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అందించాలి.

మీడియాతో మాట్లాడిన కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. వినతిపత్రాలు ఇచ్చినా స్పందించకుండా, ఇప్పుడు టర్మినేషన్లు మరియు అరెస్టులతో మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు" అని ఆరోపించారు.

యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల భవిష్యత్తులో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లినా దానికి ప్రభుత్వం, విద్యుత్ బోర్డులే బాధ్యత వహించాలి. మా సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని అన్నారు

KTPS ప్రాంగణానికి భారీగా తరలివస్తున్న ఆర్టిజన్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పలువురు నేతలను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల ఆంక్షలు, యాజమాన్యం బెదిరింపుల మధ్య సమ్మె మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు పిలిచి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

Next Story