Atmakur: ఆత్మకూరులో అట్టహాసంగా 'పోషణ పక్వాడ' వేడుకలు

Atmakur: ఆత్మకూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 'పోషణ పక్వాడ' వేడుకలు ప్రారంభమయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 April 2026 1:54 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో అట్టహాసంగా 'పోషణ పక్వాడ' వేడుకలు

Atmakur: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోషణ పక్వాడ వేడుకలను ఈరోజు నుండి 23వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలతో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆత్మకూరు పరిధిలోని సంగం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు, పిఎంఎంవివై ప్రోగ్రాం కింద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ పి సునీత హాజరయ్యారు.

గర్భవతులు ప్రతి నెల 9వ తేదీన పీహెచ్సీలో ఆరోగ్య పరీక్షలు చేయించు కోవాలని గర్భధారణ సమయంలో ఆహారం మరియు సంరక్షణ ,సరైన బరువు, పెరుగుదల మొదలగు విషయాలపై గర్భిణీలకు అవగాహన కల్పించారు అంతేకాకుండా బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం మరియు కేవలం ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వవలెను ,7వ నెల నుండి అనుబంధ ఆహారాన్ని అందించడం మొదలగు విషయాల మీద అవగాహన కల్పించారు.

సంగం పి హెచ్ సి డాక్టరు అశోక్ గర్భవతులను ఉద్దేశించి మాట్లాడారు. హెల్త్ సూపర్వైజర్ ఆరోగ్య మేరీ గర్భవతులు సరైన టైంలో ఏయన్సి లు హెచ్బి అన్ని పరీక్షలు చేయించుకొని వాళ్ళ ఆరోగ్యం పట్ల పోషణ పట్ల మెరుగైన సేవలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story