KTR: ఒక్క మంత్రిని కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ప్రజలు బర్తరఫ్ చేస్తారు
KTR: తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలనడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు.
KTR: ఒక్క మంత్రిని కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ప్రజలు బర్తరఫ్ చేస్తారు
KTR: తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్‌లోని డా. బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన 'యువ సమరభేరీ' బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణను సాధించిపెట్టిన మహానేత రాజీనామా చేయాలా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదని, రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ప్రజలు సాగనంపడం ఖాయమని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి విజన్ కరవయ్యిందని, కేవలం విధ్వంసమే మిగిలిందని కేటీఆర్ దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని ఆరోపించారు. యువత ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తే వారిని అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో ప్రభుత్వం 'లూటిఫికేషన్' చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను యువత గమనిస్తోందని, త్వరలోనే తగిన తీర్పు చెబుతారని స్పష్టం చేశారు.




