Peddapalli: వాగు ఒడ్డున క్షుద్ర పూజల కలకలం.. మంత్రగాళ్ల ముఠా అరెస్ట్!
Peddapalli: పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం సమీపంలోని మానేరు వాగు ఒడ్డున క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న మంత్రగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Peddapalli: వాగు ఒడ్డున క్షుద్ర పూజల కలకలం.. మంత్రగాళ్ల ముఠా అరెస్ట్!
Peddapalli: పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మనుషుల నమ్మకాలను ఆసరాగా చేసుకుని కొందరు మంత్రగాళ్లు పట్టపగలే క్షుద్ర పూజలకు తెరలేపారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి ఈ ముఠా గుట్టురట్టు చేశారు.కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం సమీపంలోని మానేరు వాగు ఒడ్డున ఈ ఘటన చోటుచేసుకుంది.
నిర్మానుష్యంగా ఉన్న వాగు ఒడ్డును అడ్డాగా చేసుకున్న కొందరు మంత్రగాళ్లు, వింత బొమ్మలు, నిమ్మకాయలు మరియు తాయత్తులతో మంత్రతంత్రాలు నిర్వహిస్తున్నారు. పట్టపగలే ఈ భయానక దృశ్యాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు..రంగంలోకి దిగిన కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు అక్కడ మెరుపు దాడి చేశారు. పూజలు నిర్వహిస్తున్న మంత్రగాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఘటనా స్థలంలో క్షుద్ర పూజలకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మూఢనమ్మకాల పేరుతో ప్రజలను భయపెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.




