Peddapalli: ప్రజాపాలనే మా ఊపిరి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు!

Peddapalli: పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు ఓదెల మండలం రూపునారాయణ పేటలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 5:57 PM IST
Peddapalli
X

Peddapalli: ప్రజాపాలనే మా ఊపిరి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు!

Peddapalli: ఓదెల మండలం రూపునారాయణ పేట గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో పాల్గొన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు.

ఈ సందర్బంగా ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రూపునారాయణపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500/- రూపాయలకు గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్ల కొనుగోలు 500 బోనస్, చేయూత పెన్షన్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కళ్యాణలక్ష్మి /షాది ముబారక్ చెక్కులు, కొత్తరేషన్ కార్డులు అందించడం జరుగుతుంది అలాగే నూతన పధకాలు ఇందిరామ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా ఆర్థిక సహాయం,ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం కల్పించడం జరుగుతుంది. దివ్యంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనలు పంపిణి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలను చేరవేసేలా ప్రభుత్వ కృషి చేస్తుందని అలాగే ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించి అవగాహనా కల్పించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,ఎంపీడీఓ, AD మరియు గ్రామ సర్పంచ్,బొంగోని రమ శ్రీనివాస్,ఉపసర్పంచ్ జిలుక స్వప్న సంతోష్,మరియు మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story