Peddapalli: బాండ్ పేపర్ రాసి ఇచ్చి.. ఇంటికి తాళం వేసి పరారైన వీవోఏ!
Peddapalli: పెద్దపల్లి జిల్లా పెగడపల్లిలో స్వశక్తి మహిళా సంఘాల సభ్యుల పేరు మీద రూ. 26 లక్షల రుణాలు తీసి వీవోఏ మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది.
Peddapalli: బాండ్ పేపర్ రాసి ఇచ్చి.. ఇంటికి తాళం వేసి పరారైన వీవోఏ!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో స్వశక్తి మహిళల సొమ్ము రూ 26లక్షలు ఆ గ్రామంలో పని చేసే వీవోఏ మాయం: చేసింది. డబ్బులు అడిగితే ఆరు నెలల వాయిదా పెట్టింది. ఆరు నెలల గడువు తీరాక డబ్బులు కట్టక పోవడంతో స్వశక్తి సంఘాల మహిళలు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పెగడపల్లి గ్రామంలో వినాయక వీవో సంఘంలో ఉన్న రూ.26,01,400 లను స్వశక్తి సంఘంలో పని చేస్తున్న మహిళల పేరుమీద వీవోఏ తీసుకున్నట్లు మహిళా సంఘం సభ్యులు ఆరోపించారు. గ్రామంలో పని చేసే వీవోఏ, వినాయక వీవో గ్రూపు లోని పలు మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండా శ్రీనిధి, వీవో లోన్, బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.26,01,400 లను అప్పుగా వారికి తెలియకుండా తీసుకుంది మహిళా సంఘం సభ్యులందరితో సంతకాలు పెట్టించుకొని, డబ్బులు మాయం చేసినట్లు మహిళలు గరువారం ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా మహిళా సంఘాల సభ్యుల వద్దకు శ్రీనిధి ప్రతినిధులతో పాటు, బ్యాంకు అధికారులు వచ్చి మీరు తీసుకున్న రుణం కట్టాలని అడగడంతో, మేము లోన్ తీసుకోలేదని గ్రూపు సభ్యులు ఆందోళన చెంది, వీవోఏ ను నిలదీశారు. ఈ విషయమై నేనే మీ డబ్బులు వాడుకున్నాని, మీడబ్బులు మీకు ఇస్తాను. ఆరు నెలలు గడువు కావాలని వీవోఏ చెప్పి, బాండ్ పేపర్ వ్రాసి ఇచ్చింది. ఆరు నెలల గడువు తీరిన తరువాత వివోఏ ఇంటికి డబ్బులు కట్టాలని అడగడానికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఆందోళనకు చెందిన మహిళలు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.
మా డబ్బులు మాయం చేసిన విషయంలో గతంలో ఇక్కడ పని చేసిన ఇద్దరు ఉద్యోగుల పాత్ర ఉందని మహిళలు ఆరోపించారు మహిళా సంఘాల డబ్బులు మాయం అయ్యాయని వీవోఏ కాజేసిందని సంభందిత అధికారులకు పిర్యాదు చేసినా ఇంత వరకు ఆమే పై లాంటి చర్యలు తీసుకోక పోవడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ విషయమై ఏపీఎం లవకుమార్ ను వివరణ కోరగా పెగడపల్లి మహిళా సంఘం గ్రూపులో డబ్బులు మాయం అయ్యింది నిజమేనన్నారు ఈ విషయమై జిల్లా అధికారులకు పిర్యాదు చేశానన్నారు. మహిళా సంఘాల సభ్యులు మాట్లాడుతూ తమకు న్యాయం చేసి, మా డబ్బులు మాకు ఇప్పించాలని వేడుకున్నారు.
సందర్భంగా మహిళ సంఘ సభ్యులు మాట్లాడుతూ మేము కూలి పని చేసుకుని జీవించే వాళ్ళమని రూపాయి రూపాయి పోగుచేసుకొని మహిళా సంఘం డబ్బులు కడుతున్నామని మా కష్టార్జితాన్ని వివోఏ కాజేసింది అని సంతకాలు తీసుకుని మా పేర్ల మీద లోన్లు తీసుకుని మమ్మల్ని మోసం చేసిందన్నారు.అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తం దారి మళ్లించడం సాధ్యం కాదు అని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఈ ఘటనపై విచారణ చేపట్టి నాకు తగిన న్యాయం చేయాలని బాధిత మహిళా సంఘ సభ్యులు కోరుతున్నారు.




